Samantha: 'సిటాడెల్' కు డబ్బింగ్ పూర్తి చేసుకున్న సమంత

Samantha completes dubbing for Citadel
  • సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన సమంత
  • రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం 
  • షూటింగ్ పూర్తి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
నటి సమంత ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో సమాంతరంగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇందులో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నారు. సిటాడెల్ వాస్తవానికి హాలీవుడ్ వెబ్ సిరీస్. అందులో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించింది. దీని భారతీయ వెర్షన్ లో సమంతా నటిస్తోంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కు రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడు. ప్రస్తుతం సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Samantha
Citadel
Dubbing
Web Series

More Telugu News