Viduthalai: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'విడుదల' టీమ్ కి 5 నిమిషాల అప్లాజ్!

Viduthalai Movie Update

  • క్రితం ఏడాది వచ్చిన 'విడుదలై'
  • ఫారెస్టు ప్రాంతంలో నడిచే కథ 
  • భారీ విజయాన్ని అందుకున్న సినిమా 
  • ఇళయరాజా సంగీతం హైలైట్


క్రితం ఏడాది తమిళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా 'విడుదలై పార్టు 1' నిలిచింది. 'విడుదల' పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా పలకరించింది. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈ సినిమాకి 'రోటర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్'లో 5 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్టుగా మేకర్స్ తెలియజేశారు. అందుకు సంబంధించిన హ్యాపీ మూమెంట్ ను షేర్ చేసి ... ఆనందాన్ని వ్యక్తం చేశారు. కమెడియన్ సూరి ఈ సినిమాలో కథానాయకుడు కాగా, తీవ్రవాది పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. గౌతమ్ మీనన్ .. బాలాజీ శక్తివేల్ .. ఇళవరసు ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

కొత్తగా పోస్టింగ్ తో ఫారెస్టులోని ఒక గూడానికి వచ్చిన పోలీస్ .. ఆ గూడెం లోని ఓ గిరిజన యువతి .. ఆ ఫారెస్టులో తలదాచుకున్న ఓ తీవ్రవాది .. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది. అద్భుతమైన లొకేషన్స్ తో .. ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్. ఆయన స్వరపరిచిన 'ఒన్నోడ నడందా .. కల్లాన కాడు' అనే పాట, ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప మెలోడీ.

  • Loading...

More Telugu News