Vishnu Kumar Raju: 40 వేల మంది పట్టే స్థలంలో సభ ఏర్పాటు చేసి.. 4 లక్షల మంది వచ్చారని చెపుతున్నారు: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju fires on CM Jagan

  • ప్రజలను ఓటు అడిగే హక్కు జగన్ కు లేదన్న విష్ణురాజు
  • ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శ
  • అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపాటు

ఇటీవల భీమిలిలో సీఎం జగన్ నిర్వహించిన 'సిద్ధం' సభపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. 40 వేల మంది పట్టే స్థలంలో సభను ఏర్పాటు చేసి... నాలుగు లక్షల మంది వచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు జగన్ కు లేదని అన్నారు.  విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు విష్ణురాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణురాజు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.    

రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని... ఆయనకు సమయం దగ్గరపడిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్టేనని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజాపోరు కార్యక్రమం ద్వారా జగన్ దుర్మార్గాలను ఎండగడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News