Revanth Reddy: ఝార్ఖండ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy entered the field in the wake of the Jharkhand crisis
  • హేమంత్ సోరెన్ అరెస్ట్‌తో ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం
  • ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం హైదరాబాద్‌కు తరలింపు
  • ఏఐసీసీ సూచనల మేరకు క్యాంపును ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి
 ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఏఐసీసీ పెద్దలు రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు. క్యాంపు కోసం ఏర్పాట్లు చేశారు.

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం నేత, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిన్న ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించి... ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అంతకుముందు హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. దీంతో జేఎంఎం సీనియర్ నేత చంపయ్ సోరెన్‌ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరికి క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.
Revanth Reddy
Telangana
jharkhand

More Telugu News