Mahesh Babu: శ్రీమంతుడు వివాదం: మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటున్న శరత్ చంద్ర

Will file a case on Mahesh Babu says writer Sarath Chandra

  • తన కథను కాపీ కొట్టి శ్రీమంతుడు చిత్రాన్ని తీశారంటున్న రచయిత శరత్ చంద్ర
  • కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు
  • మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేసేందుకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది. అయితే, ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిన శరత్ చంద్ర కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. 

ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ... గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News