Seethakka: మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి ఊడ్చిన మంత్రి సీతక్క

Minister Seethakka sweeping in Medaram
  • మేడారంలో పర్యటించిన మంత్రి సీతక్క
  • జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
  • మేడారం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని సూచన
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చీపురు పట్టారు. స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఆమె మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ... సమ్మక్క సారలక్కలను దర్శించుకోవడానికి వచ్చే వారందరూ మేడారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మేడారంలో ఎవరూ ప్లాస్టిక్ ఉపయోగించవద్దని కోరారు. ప్లాస్టిక్ అమ్మినా... వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉదయం కొండాయి గ్రామానికి చేరుకున్న సీతక్క గోవిందరాజుల ఆలయం, నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. ఆలయాల అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు. పూజారులు, అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. జంపన్నవాగు వద్దకు కూడా వెళ్లారు. మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
Seethakka
medaram
Telangana
sammakka
sarakka

More Telugu News