Kannappa: త్వరలో మంచు విష్ణు 'కన్నప్ప' రెండో షెడ్యూల్

Manchu Vishnu says Kannappa unit gearing up for 2nd schedule
  • మంచు విష్ణు ప్రధానపాత్రలో కన్నప్ప
  • ఇటీవల న్యూజిలాండ్ లో తొలి షెడ్యూల్ పూర్తి
  • రెండో షెడ్యూల్ కు సిద్ధం అంటూ మంచు విష్ణు అప్ డేట్
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప త్వరలోనే రెండో షెడ్యూల్ లో అడుగుపెట్టనుంది. కన్నప్ప చిత్రానికి మహాభారత్  సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇటీవలే న్యూజిలాండ్ లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తొలి షెడ్యూల్ లో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి హేమాహేమీలపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ కూడా నటిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, కన్నప్ప చిత్రంపై మంచు విష్ణు నేడు అప్ డేట్ ఇచ్చారు. రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో సన్నాహక వీడియోను కూడా పంచుకున్నారు.
Kannappa
Manchu Vishnu
2nd Schedule
Dream Project
Tollywood

More Telugu News