Nadendla Manohar: సజ్జలకు ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారు?: నాదెండ్ల

Nadendla continues his criticism on govt advisers
  • ప్రభుత్వ సలహాదారుల విషయమై విమర్శల దాడిని కొనసాగించిన నాదెండ్ల
  • సజ్జల రూ.2.40 లక్షల వేతనం తీసుకుంటున్నారని వెల్లడి
  • సీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యలు 
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు కోట్ల రూపాయలు ముట్టచెపుతున్నారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. సీఎం ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యానించారు. సలహాదారులకు రూ.14 వేలు ఇస్తామని మొదట చెప్పారని, కానీ, సలహాదారు సజ్జల రూ.2.40 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సజ్జలకు ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుకు మంత్రి ప్రోటోకాల్, ఆ స్థాయిలో ఖర్చులు ఏంటని నిలదీశారు. సలహాదారుల నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేశారు.
Nadendla Manohar
Advisers
Sajjala Ramakrishna Reddy
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News