Chiranjeevi: నిస్సందేహంగా అద్వానీ భారతరత్నకు అర్హులు: చిరంజీవి స్పందన

Chiranjeevi says Bharat Ratna is undoubtedly a greatly deserving honour to Advani
  • మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరు అని ప్రశంస
  • అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదన్న చిరంజీవి
  • రాజకీయాల యొక్క... రాజకీయ నాయకుల యొక్క స్థాయిని, గౌరవాన్ని పెంచారని వ్యాఖ్య
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా... అద్వానీ భారతరత్నకు నిస్సందేహంగా అర్హులు అంటూ పేర్కొన్నారు. మన భారత దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు అని కొనియాడారు. స్వాతంత్రానికి ముందు నుంచీ... అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదన్నారు. అద్వానీ వంటి దిగ్గజ నాయకులు... రాజకీయాల యొక్క... రాజకీయ నాయకుల యొక్క స్థాయిని మరియు  గౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ భారతరత్నకు ఎంపికైన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయనను గౌరవించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రధాని శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Chiranjeevi
LK Advani
Bharat Ratna
BJP

More Telugu News