Shubhman Gill: గిల్ ఆ రివ్యూ తీసుకోకుండా ఉండుంటే...!

Gill talks about review taken at early of his innigs

  • విశాఖ టెస్టులో గిల్ సెంచరీ
  • 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అని ప్రకటించిన అంపైర్
  • అయ్యర్ సలహాతో రివ్యూ తీసుకున్న గిల్
  • బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్లకు తాకినట్టు రివ్యూలో వెల్లడి
  • నాటౌట్ అని ప్రకటించిన అంపైర్

టీమిండియా యువ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ విశాఖ టెస్టులో సెంచరీ సాధించడం తెలిసిందే. ఇంగ్లండ్ తో టెస్టులో గిల్ రెండో ఇన్నింగ్స్ లో 104 పరుగులతో కీలక బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. 

వాస్తవానికి గిల్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే అవుటవ్వాల్సిన మాట! ఇంగ్లండ్ స్పిన్నర్ హార్ట్ లే విసిరిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. దాంతో ఇంగ్లండ్ జట్టు అప్పీల్ చేయగా, గిల్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించాడు. టీవీల్లో చూసినవాళ్లకు కూడా అది అవుట్ అనే అనిపించింది.

అయితే, నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ డీఆర్ఎస్ తీసుకోమని గిల్ కు సూచించాడు. అయ్యర్ సూచన మేరకు గిల్ రివ్యూ తీసుకోగా... బంతి మొదట బ్యాట్ ను తాకి , ఆ తర్వాత ప్యాడ్లను తాకినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించింది. దాంతో గిల్ బతికిపోయాడు. అంపైర్ గిల్ ను నాటౌట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. గిల్ ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 147 బంతులాడి 11 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు చేశాడు. 

ఇవాళ మూడో రోజు ఆట ముగిశాక గిల్ మాట్లాడుతూ, శ్రేయాస్ అయ్యర్ చెప్పడం వల్లే తాను రివ్యూ తీసుకున్నానని వెల్లడించాడు. బ్యాట్ ఎడ్జ్ తగిలిందన్న విషయం తనకు తెలియదని, తాను అవుటయ్యాననే అనుకున్నానని వివరించాడు. రివ్యూ తీసుకోవడం లాభించిందని తెలిపాడు.

  • Loading...

More Telugu News