Kavya Krishna Reddy: కావలి నియోజకవర్గ ఇన్‌చార్జిని ప్రకటించిన టీడీపీ

TDP declared Kavya Krishna Reddy as incharge of Kavali Constituency
  • కావ్య కృష్ణారెడ్డి పేరుని ఖరారు చేసిన అధిష్ఠానం
  • చంద్రబాబు ఆదేశానుసారం అచ్చెన్నాయుడు ప్రకటన
  • అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టిసారించిన పార్టీలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాయి. ఖరారైన అభ్యర్థుల పేర్లను పార్టీలు ప్రకటిస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే పలు జాబితాలను ప్రకటించింది. ఇక జనసేనతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన విపక్ష టీడీపీ.. కావలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిని (కావ్య కృష్ణా రెడ్డి) ఖరారు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావలి నియోజకవర్గానికి దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
Kavya Krishna Reddy
TDP
Kavali Constituency
Chandrababu

More Telugu News