Lal Salaam: 'బాబా' ఓ చేదు అనుభవం .. ఆ విషయాన్ని ప్రస్తావించిన రజనీకాంత్!
- 2002లో విడుదలైన 'బాబా'
- నిర్మాతగా వ్యవహరించిన రజనీ
- బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా
- 'లాల్ సలామ్' వేడుకలో గుర్తుచేసుకున్న రజనీ
రజనీకాంత్ కీలకమైన పాత్రను పోషించిన 'లాల్ సలామ్' సినిమా, ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, లైకా వారు నిర్మించారు. విష్ణు విశాల్ - విక్రాంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ సినిమాకి సంబంధించిన వేడుకలో రజనీ మాట్లాడుతూ, 'బాబా' సినిమా తరువాత నేను ఇక నిర్మాణ రంగం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్లనే ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నేను నిర్మాతగా ఉండలేకపోయాను" అని అన్నారు. దాంతో ఇప్పుడు చాలామంది 'బాబా' సినిమా రోజులకి వెళ్లిపోయారు.
రజనీకాంత్ నిర్మించిన 'బాబా' సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే అందించినది కూడా రజనీనే కావడం విశేషం. అయితే ఈ సినిమా .. బయ్యర్లకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ నష్టాలను భర్తీ చేయమని అప్పట్లో బయ్యర్లు పెద్ద గోల చేశారు కూడా. ఆ చేదు అనుభవాన్ని రజనీ ఈ సినిమా సమయంలో గుర్తుచేసుకున్నారన్న మాట.