RRB Job Calender 2024: జాబ్ నోటిఫికేషన్స్, పరీక్షల షెడ్యూల్‌తో వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆర్ఆర్‌బీ
- ఏడాది పొడవునా కీలక పరీక్షల షెడ్యూల్ ప్రకటన
- ఏప్రిల్ - జూన్ మధ్య ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్స్ పరీక్ష.. మొత్తం 9,000 ఖాళీలు
- జులై-సెప్టెంబర్ మధ్య ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ పరీక్ష
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వార్షిక క్యాలెండర్-2024ను విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ క్యాలెండర్‌ను అందుబాటులో ఉంచింది. రాబోయే నోటిఫికేషన్‌లు, పరీక్ష షెడ్యూల్ ఈ క్యాలెండర్‌లో ఉన్నాయి. నాన్-గ్రాడ్యుయేట్ పాప్యులర్ కేటగిరీలైన గ్రాడ్యుయేట్ (4, 5, 6 లెవల్స్), అండర్ గ్రాడ్యుయేట్ (లెవెల్‌లు 2, 3) పోస్టులు, జూనియర్ ఇంజనీర్లు, పారామెడికల్ రెండింటికీ సాంకేతికేతర ప్రసిద్ధ కేటగిరీలతో సహా వివిధ వర్గాల కోసం పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కేటగిరీలు, గ్రూప్-డీ స్థాయి, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించిన జాబ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటితో పాటు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్, 9,000 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు క్యాలెండర్ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 2న విడుదలైన రైల్వే వార్షిక క్యాలెండర్‌ను ఆర్‌ఆర్‌బీ అధికారికంగా అందుబాటులో ఉంచింది.
వార్షిక క్యాలెండర్ ప్రకారం టెక్నీషియన్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ - జూన్ మధ్య పరీక్ష షెడ్యూల్ నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ (RRB ALP) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎన్‌టీపీసీ (గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్), జూనియర్ ఇంజనీర్స్ (జేఈ), పారామెడికల్ కేటగిరీలు, గ్రూప్-డీతో పాటు పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జులై - సెప్టెంబర్ నెలల మధ్య జారీ కానుంది. ఇక మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నోటిఫికేషన్ అక్టోబర్ - డిసెంబర్ 2024 మధ్య విడుదలవనుంది.
- నోటిఫికేషన్ విడుదల తేదీలు
ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ జనవరి 20, 2024 (5,696 ఖాళీలు) - ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్స్ - ఏప్రిల్ - జూన్ 2024 (9,000 ఖాళీలు)
- గ్రాడ్యుయేట్స్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ 2024 (లెవల్ 4, 5, 6) - జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
- ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ 2024 - అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3)- జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
- ఆర్‌ఆర్‌బీ జేఈ రిక్రూట్‌మెంట్ 2024 జులై-సెప్టెంబర్ మధ్య నోటిఫికేషన్ విడుదల
- ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024- జులై-సెప్టెంబర్ మధ్య విడుదల
- ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2024- జులై-సెప్టెంబర్ విడుదల
- ఆర్‌ఆర్‌బీ ఎంఐ రిక్రూట్‌మెంట్ 2024 - అక్టోబర్ - డిసెంబర్ మధ్య నోటిఫికేషన్ విడుదల.