Treason Cases: ఐదేళ్లలో దేశంలో ఎన్ని దేశద్రోహం కేసులు నమోదయ్యాయంటే..!
- 2018-22 మధ్యకాలంలో 701 దేశద్రోహం కేసుల నమోదు
- 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసుల నమోదు
- లోక్ సభలో వివరాలను వెల్లడించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి
2018 నుంచి 2022 మధ్యకాలంలో మన దేశంలో 701 దేశద్రోహం కేసులు... 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఈ కేసుల్లో 788 మంది అరెస్ట్ అయ్యారని, 500 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు. 131 మందిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయని చెప్పారు. 2021లో 149 దేశద్రోహం కేసులు, 2022లో 68 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.