YS Sharmila: నేటి నుంచి షర్మిల జిల్లాల టూర్‌.. 11న మంత్రి రోజా ఇలాకాలో బహిరంగసభ

YS Sharmila district tours from today

  • ఈరోజు నుంచి 11వ తేదీ వరకు షర్మిల జిల్లాల పర్యటన
  • ఉదయం రచ్చబండ కార్యక్రమాలు.. సాయంత్రం బహిరంగసభలు
  • ఈ సాయంత్రం బాపట్లలో బహిరంగసభ

పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఏపీలో పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలతో కలసి ఆమె రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. తన ప్రసంగాల్లో అధికార వైసీపీని ఆమె ఎండగడుతున్నారు. టీడీపీపై కూడా సున్నిత విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె ఈరోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఉదయం రచ్చబండ కార్యక్రమాలు, సాయంత్రం బహిరంగసభలతో ఆమె ప్రజల మధ్యకు వెళ్తున్నారు. 

షర్మిల పర్యటన షెడ్యూల్:
  • ఈరోజు - సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగసభ
  • 8వ తేదీ - ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగసభ
  • 9వ తేదీ - ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగసభ
  • 10వ తేదీ - ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగసభ
  • 11వ తేదీ - సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగసభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.

  • Loading...

More Telugu News