Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సజ్జల వ్యాఖ్యలు
- నిన్న ఢిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు
- చంద్రబాబు గతంలో బీజేపీ నేతలను తిట్టాడన్న సజ్జల
- చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని వ్యాఖ్యలు
- టీడీపీ బలహీనంగా ఉన్నందునే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు గతరాత్రి బాగా పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని విమర్శించారు. ఏపీలో టీడీపీ బలహీనంగా ఉండడం వల్లే బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ బలహీనత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ పర్యటన ఒక నిదర్శనం అని పేర్కొన్నారు.
టీడీపీ గతంలోనూ ఇలాగే పొత్తుల కోసం ప్రయత్నాలు చేసిందని, బలం ఉంటే ఒకరితో పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెంటిలేటర్ పై ఉన్న పార్టీని బలంగా చూపించడం కోసం తీవ్రనిరాశా నిస్పృహలతో చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోందని సజ్జల పేర్కొన్నారు.