Shotdead on Facebook live: ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య!

On Facebook Live Team Thackeray Leaders Son Shot Dead In Mumbai
  • ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఘటన
  • శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్‌ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం
  • ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య
  • అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఓ నాయకుడి కుమారుడు అభిషేక్ ఘోసాల్కర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించిన నిందితుడు మారిస్ నోరాన్హా ఘోసాల్కర్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఎమ్‌హెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్ కుమారుడే అభిషేక్. మారిస్‌తో అతడికి విభేదాలు ఉండేవి. ఇటీవలే వారు రాజీ పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో మారిస్‌, అభిషేక్‌ను ఫైస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించాడు.  లైమ్‌ స్ట్రీమ్‌ సందర్భంగా మారిస్ ఈ దారుణానికి తెగబడ్డాడు. 

ఇటీవలే ఏక్‌నాథ్ శిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు తెగబడిన ఘటన వైరల్‌గా మారింది. ఈ కలకలం సద్దుమణగక ముందే అభిషేక్ హత్య జరగడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణాలు ఇంకెన్ని రోజులు భరించాలని ప్రశ్నించారు. హింస ప్రజ్వరిల్లితే పరిశ్రమలు రాష్ట్రానికి రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు.
Shotdead on Facebook live
Shivasena UBT
Mumbai
Maharashtra
Crime News

More Telugu News