American Airlines: విమానం టాయిలెట్‌లో బాలికలను సీక్రెట్‌‌గా రికార్డ్ చేసిన ఫ్లైట్ అటెండెంట్.. అరెస్ట్!

Case Against Flight Attendant Accused Of Filming Minors In Plane Toilet
  • అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో జరిగిన దారుణం
  • గతేడాది విమానంలో పలువురు బాలికలను సీక్రెట్‌గా రికార్డు చేసిన నిందితుడు
  • బాత్రూమ్‌లోని సెల్‌ఫోన్‌ను ఓ బాధితురాలు గుర్తించడంతో బయటపడ్డ దారుణం
  • ఆ తరువాత అధికారుల దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వరుస ఘటనలు
  • ఎయిర్‌లైన్స్ సంస్థపైనా బాధితుల కేసు నమోదు
విమానం బాత్రూమ్‌లో మైనర్ బాలికలు ఉండగా సీక్రెట్‌గా కెమెరాతో రికార్డు చేసిన ఫ్లైట్ సిబ్బంది ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితుడిని ఎస్టెస్ కార్టర్ థామ్సన్‌గా గుర్తించారు. ఈ క్రమంలో బాధితులు ఎయిర్‌లైన్స్‌ సంస్థపైనా కేసులు నమోదు చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గతేడాది ఈ ఘటన జరగగా, తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. 

గత సెప్టెంబర్‌లో విమానప్రయాణం సందర్భంగా నిందితుడు థామ్సన్ (34).. 14 ఏళ్ల మైనర్ బాలికను సీక్రెట్‌గా తన ఐఫోన్ కెమెరాతో చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. బాధితుల కథనం ప్రకారం. థామ్సన్ తొలుత బాలికను పక్కనే ఉన్న బాత్రూమ్ బాలేదని చెప్పి ఫస్ట్ క్లాస్ సెక్షన్‌లోని బాత్రూమ్‌కు పంపించాడు. అందులో సెల్‌ఫోన్‌ను టేపుతో గోడకు అంటించి ఉన్న విషయాన్ని బాలిక గుర్తించింది. ఈ విషయమై బాలిక తండ్రి నిందితుడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు బాత్రూమ్‌లోకి వెళ్లి లొపలి నుంచి గడియపెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడు మొబైల్‌లోని వీడియోలను డిలీట్ చేసుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించగా తొమ్మిదేళ్ల మరో బాలికతో సహా నలుగురు మైనర్లను నిందితుడు టార్గెట్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో,  చిన్నారుల తల్లిదండ్రులు నిందితుడితో పాటూ ఎయిర్‌లైన్స్ సంస్థపై కేసు నమోదు చేశారు. గతేడాది జనవరి- ఆగస్టు మధ్య కాలంలో నిందితుడు.. 7, 9, 11, 13 ఏళ్ల వయసున్న నలుగురు చిన్నారులను సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు వెల్లడైంది. అతడి ఐక్లౌడ్‌ అకౌంట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. లైంగిక వేధింపులకు యత్నించడం, చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల కింద పోలీసులు నిందితుడిపై కేసులు నమోదు చేశారు.
American Airlines
Flight Attendant
USA
Crime News
Secretly recording minors

More Telugu News