Sonia Gandhi: పి.వి.నరసింహారావుకు భారతరత్న రావడంపై సోనియా గాంధీ స్పందన
- పి.వి.తో పాటు చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న
- ఈ ముగ్గురికి భారతరత్న ప్రకటనపై సోనియాను ప్రశ్నించిన మీడియా
- భారతరత్న రావడాన్ని స్వాగతిస్తున్నామన్న సోనియా గాంధీ
దివంగత మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎంస్ స్వామినాథన్‌లకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని స్పందించమని కోరగా.. 'వారికి భారతరత్న రావడాన్ని స్వాగతిస్తున్నాం... ఎందుకు స్వాగతించం?' అన్నారు.
ఇక ఈ ముగ్గురు ప్రముఖుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి భారతరత్న ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మూడు వేర్వేరు ట్వీట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న పురస్కారం లభించింది. కర్పూరీ ఠాకూర్, ఎల్కే అద్వానీలకు ఇప్పటికే ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.