Ch Malla Reddy: కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు మా కుటుంబం నుంచీ ఉండాలనుకున్నాం: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy interesting comments on three posts in his family
  • లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్న మల్లారెడ్డి
  • ఎంపీ టిక్కెట్ కోసమే జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారన్న మల్లారెడ్డి
  • తెలంగాణవ్యాప్తంగా ఫోకస్ కావడానికే జగ్గారెడ్డి తన పేరును లేవనెత్తుతున్నాడని విమర్శ
కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లుగానే తమ కుటుంబం నుంచీ మూడు పదవులు ఉండాలని భావించామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి తన తనయుడు సిద్ధమే అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టిక్కెట్ కోసం జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ కావడం కోసమే జగ్గారెడ్డి తన పేరును ఎత్తుకుంటున్నారని విమర్శించారు. తన పేరును తీయకుంటే జగ్గారెడ్డిని తెలంగాణలో ఎవరూ పట్టించుకోరన్నారు.
Ch Malla Reddy
Telangana
Congress

More Telugu News