Mahesh Babu: మహేశ్‌బాబు కుమార్తె సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే!

Cyber Criminals send fraud links in the name of actor Mahesh Babu daughter Sitara
  • సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు
  • ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ
సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే. 

ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది.
Mahesh Babu
Sitara
Cybercrime
Hyderabad
Fraud Links

More Telugu News