DSC: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల... వివరాలు ఇవిగో!

AP Govt releases DSC Notification

  • నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్
  • మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
  • ఆన్ లైన్ విధానంలో పరీక్షలు
  • 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు

ఏపీలో టీచర్ పోస్టుల నియామకాలకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

టీచర్ పోస్టుల వివరాలు...

మొత్తం పోస్టులు: 6,100
ఎస్జీటీల సంఖ్య: 2,280
స్కూల్ అసిస్టెంట్లు: 2,299
టీజీటీలు: 1,264
పీజీటీలు: 215
ప్రిన్సిపాల్స్: 42

ముఖ్యమైన తేదీలు...

ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు
ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు అవకాశం
మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్

ఇతర వివరాలు...

2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు
రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి మరో ఐదేళ్లు పెంపు
పూర్తి వివరాలకు cse.apgov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. 

  • Loading...

More Telugu News