Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు... మరింత పతనమైన పేటీఎం షేర్లు
- 483 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 127 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మరో 10 శాతం పడిపోయిన పేటీఎం మాతృ సంస్థ వన్97 షేర్ల విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు లాభపడి 71,555కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 21,743 వద్ద స్థిరపడింది. మరోవైపు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల పతనం ఈరోజు కూడా కొనసాగింది. ఈరోజు మరో 10 శాతం నష్టపోయిన పేటీఎం షేర్లు రూ. 380 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే ఇండియా కరెన్సీ మారకం విలువ రూ. 83.01గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.46%), యాక్సిస్ బ్యాంక్ (2.30%), విప్రో (2.14%), ఎన్టీపీసీ (1.85%), కోటక్ బ్యాంక్ (1.58%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.85%), టైటాన్ (-0.60%), టాటా మోటార్స్ (-0.48%), ఐటీసీ (-0.06%).