Medaram Jatara: నేడు మేడారం మహా జాతర ప్రారంభం

Medaram jatara begins today

  • మండమెలిగే ప్రత్యేక పూజలతో నేడు జాతర ప్రారంభం
  • బుధవారం నుంచి గురువారం వేకువజాము వరకూ వేడుక
  • ఉదయమంతా మండమెలిగే పూజలు, రాత్రంతా గద్దెలపై పూజారుల జాగారం

ఆసియాలోనే అది పెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. 

పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగ అంటారు. ఇందులో భాగంగా పూజారులు పగలంతా తలో పని చేసి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.

  • Loading...

More Telugu News