Bandla Ganesh: చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ కు ఏడాది జైలు

One Year Imprisionment To Bandla Ganesh In Cheque bounce case
  • 2019లో జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద గణేశ్ రూ.95 లక్షల అప్పు  
  • చెక్ బౌన్స్ అవడంతో ఒంగోలు కోర్టును ఆశ్రయించిన బాధితుడు 
  • రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశం
  • కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆర్డర్ 
సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు.

ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకీరామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ.. జానకీరామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటు రూ. 15,86,550 జరిమానా విధించింది.
Bandla Ganesh
Cheque bounce
Imprisionment
Jail
Ongole Court

More Telugu News