Kadiam Srihari: రేవంత్ రెడ్డికి మా పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు: కడియం శ్రీహరి

Kadiyam Srihari says there is no problem for revanth reddy
  • రేవంత్ రెడ్డి తన పార్టీ వారితోనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
  • తాను, రేవంత్ రెడ్డి ఒకే స్కూల్లో చదువుకున్నామన్న కడియం శ్రీహరి
  • రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న కడియం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రేవంత్ రెడ్డి తన పార్టీ వారితోనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను, రేవంత్ రెడ్డి ఒకే స్కూల్లో చదువుకున్నామన్నారు. అయితే ఆ స్కూల్లో తాను సీనియర్ స్టూడెంట్ అయితే రేవంత్ రెడ్డి జూనియర్ అని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
Kadiam Srihari
Telangana
BRS

More Telugu News