Rahul Sipligunj: మొదటిసారిగా హిందీలో మ్యూజిక్ వీడియో విడుదల చేసిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj releases his first music video in Hindi
  • సినీ గీతాలతో, ఆల్బమ్ సాంగ్స్ తో రాణిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ 
  • ఫస్ట్ టైమ్ హిందీలో సాంగ్ రూపొందించిన వైనం
  • కాన్సెప్ట్, మ్యూజిక్, గానం అన్నీ రాహుల్ సిప్లిగంజే!
  • సాహిత్యం అందించిన బాలీవుడ్ లిరిక్ రైటర్ కుమార్ 
ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మొట్టమొదటిసారిగా హిందీలో మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ తెలుగు సినిమా పాటలే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్స్ తోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హిందీ రంగంలోనూ అడుగుపెట్టాడు. 

'తేరా భయ్యా మేరా సాలా' అంటూ సాగే ఈ టీజింగ్ సాంగ్ ను ఫారెన్ లొకేషన్లలో ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ఇందులో రాహుల్ సరసన జెన్నిఫర్ ఇమ్మాన్యుయెల్ అందాలు ఒలకబోసింది. 

ఈ పాటకు బాలీవుడ్ లిరిక్ రైటర్ కుమార్ సాహిత్యం అందించగా... కాన్సెప్ట్, సంగీతం, గానం అన్నీ రాహుల్ సిప్లిగంజే. ఈ పాట విడుదలపై రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో స్పందించాడు. 

"తేరా భయ్యా మేరా సాలా... హిందీలో నా తొలి మ్యూజిక్ వీడియో. చిచ్చాస్... దీన్ని చూసేయండి. అద్భుతమైన రీతిలో ఈ పాటకు సాహిత్యం సమకూర్చిన కుమార్ సర్ కు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు.
Rahul Sipligunj
Music Video
Hindi
Tera Bhaiyya Mera Saala
Singer
Tollywood

More Telugu News