Yashasvi Jaiswal: మూడో టెస్టు: జైస్వాల్ సూపర్ శతకం... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

Team India eyes on huge lead with Jaiswal flamboyant century

  • మూడో టెస్టులో పట్టుబిగిస్తున్న టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ నష్టానికి 196 పరుగులు
  • 322కి పెరిగిన టీమిండియా ఆధిక్యం
  • సిరీస్ లో రెండో సెంచరీ చేసిన జైస్వాల్
  • 9 ఫోర్లు, 5 సిక్సులు బాదిన యువ ఓపెనర్

రాజ్ కోట్ టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర సెంచరీ సాయంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. 

ఇవాళ ఆటకు మూడో రోజు కాగా... తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 319 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా 126 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. 

జైస్వాల్ 122 బంతుల్లో 100 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 9 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో జైస్వాల్ కు ఇది రెండో శతకం. 

ప్రస్తుతం మూడో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 51 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 196 పరుగులు. జైస్వాల్ 104 పరుగులు చేసిన అనంతరం రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి శుభ్ మాన్ గిల్ 65,  కుల్దీప్ యాదవ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. రజత్ పటీదార్ డకౌట్ అయ్యాడు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 322 పరుగులకు పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News