payal shankar: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్‌ది ముమ్మాటికీ తప్పే: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

BJP MLA Payal Shankar blames brs for kaleswaram project

  • లక్ష కోట్లు ఖర్చు చేసినా రూపాయికి కూడా అక్కరకు రాని ప్రాజెక్టుగా మిగిలిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినందువల్లే కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశమిచ్చారన్న పాయల్ శంకర్
  • ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ వివాదాలే ఉంటాయన్న అక్బరుద్దీన్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ తప్పేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, లక్ష కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయికి కూడా అక్కరకు రాని ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తప్పులు చేసినందువల్లే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ వివాదాలే: అక్బరుద్దీన్

ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ వివాదాలే ఉంటాయని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో కర్ణాటక కట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచినప్పటికీ నాటి ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయని ఆరోపించారు. బాబ్లీ విషయంలోనూ గత ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కొన్ని ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలు అనుమతులు లేకుండానే ప్రారంభించాయన్నారు.

  • Loading...

More Telugu News