Nitish Kumar: ఇండియా కూటమికి ఆ పేరే నాకు ఇష్టం లేదు: నితీశ్ కుమార్

Nitish Kumar say he did not like the name of India bloc
  • ఇండియా కూటమి నుంచి వైదొలగిన నితీశ్ కుమార్
  • ఎన్డీయేలో చేరి బీహార్ లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత
  • ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని వెల్లడి 
ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన బీహార్ అధికారపక్షం జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలిసి బీహార్ లో సరికొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్... బలపరీక్షలోనూ నెగ్గారు. 

తాజాగా నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అనవసరం అని పేర్కొన్నారు. ఇండియా కూటమికి ఆ పేరు పెట్టడమే తనకు ఇష్టం లేదని, మరో పేరు పెడదామని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. బీహార్ ప్రజల కోసమే తాను ఎన్డీయేలో చేరానని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
Nitish Kumar
INDIA Bloc
JDU
BJP
Bihar

More Telugu News