Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'పుష్ప' స్పెషల్ స్క్రీనింగ్... ఫొటోలు ఇవిగో!

Allu Arjun attends Pushpa special screening in Berlin Film Festival
  • జర్మనీలో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా బెర్లిన్ వెళ్లిన అల్లు అర్జున్
  • పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరు
  • అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి
రెండేళ్ల కిందట వచ్చిన పుష్ప చిత్రం ఇప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తోంది. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ పుష్ప కోలాహలం నెలకొంది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో సెల్ఫీలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు అక్కడి వారు పోటీలు పడ్డారు. అంతేకాదు, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా అల్లు అర్జున్ అంతర్జాతీయ మీడియాతోనూ ముచ్చటించారు.
Allu Arjun
Pushpa
Berlin Film Festival
Germany
Tollywood

More Telugu News