Gottipati Ravi Kumar: టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు తప్పిన ప్రమాదం

TDP MLA Gottipati Ravi Kumar escapes unhurt from road accident
  • గొట్టిపాటి హైదరాబాద్ వెళుతుండగా ఘటన
  • సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురైన కారు
  • ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం
  • మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయిన అద్దంకి ఎమ్మెల్యే
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ హైదరాబాద్ వెళుతుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురైంది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గొట్టిపాటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆయన మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు. గొట్టిపాటి సురక్షితంగా ఉన్నారన్న వార్త తెలియడంతో టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. 
Gottipati Ravi Kumar
Road Accident
TDP
Addanki

More Telugu News