APPSC: ఒకే రోజున ఎస్బీఐ క్లర్క్ పరీక్ష, గ్రూప్-2 పరీక్ష... ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ

APPSC wrote SBI on exams date clash

  • ఫిబ్రవరి 25న రెండు కీలక పరీక్షలు
  • సర్దుబాటు చేయాలంటూ ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ
  • 10 మంది అభ్యర్థుల వివరాలు ఎస్బీఐకి అందజేత

ఫిబ్రవరి 25న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ నియామక మెయిన్స్ పరీక్ష, ఏపీపీఎస్సీ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ఒక్క రోజునే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీపీఎస్సీ తాజాగా ఎస్బీఐకి లేఖ రాసింది. 

రెండు పరీక్షలు ఒకే రోజు జరపడం వల్ల ఏపీకి చెందిన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని తన లేఖలో పేర్కొంది. క్లర్క్ నియామక పరీక్షకు సంబంధించి సర్దుబాటు చేయాలని కోరింది. క్లర్క్ పరీక్షకు, గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 10 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ తన లేఖ ద్వారా ఎస్బీఐకి పంపించింది. మార్చి 4న కూడా క్లర్క్ నియామక మెయిన్స్ పరీక్ష జరగనున్నందున... సదరు అభ్యర్థులను మార్చి 4న జరిగే పరీక్షకు సర్దుబాటు చేయాలని కోరింది. 

ఎస్బీఐ క్లర్క్ నియామకాలకు సంబంధించి ప్రిలిమ్స్ ను జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరి 25, మార్చి 4న మెయిన్స్ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News