Gorantla Butchaiah Chowdary: ఆ వార్తలు నమ్మి భావోద్వేగాలకు గురికావొద్దు: రాజమండ్రి రూరల్ కార్యకర్తలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచన

Gorantla Butchaiah Chowdary calls party workers do not feel emotionally
  • రాజమండ్రి రూరల్ స్థానంపై అనిశ్చితి
  • జనసేన పోటీ చేస్తుందంటున్న కందుల దుర్గేశ్ 
  • తనకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని వెల్లడి
  • రాజమండ్రి రూరల్ తనదే అంటున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తనతో చెప్పారంటూ ఆ పార్టీ నేత కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

"రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మనవి... టీవీ చానళ్లలో, వాట్సాప్ మెసేజ్ లలో వస్తున్న వార్తలు ఊహాజనితం. అవి నమ్మి భావోద్వేగాలకు గురికావొద్దు. చంద్రబాబు ఆదేశాల మేరకు కచ్చితంగా నేను పోటీలో ఉంటాను. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదు. దీనిపై త్వరలోనే చంద్రబాబు ప్రకటన చేస్తారు" అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
Gorantla Butchaiah Chowdary
Rajahmundry Rural
TDP
Kandula Durgesh
Janasena

More Telugu News