APPSC: ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఊరట!

SBI allows APPSC candidates to write sbi exam on march 4
  • పరీక్ష తేదీ మార్చాలంటూ ఏపీపీఎస్సీ రాసిన లేఖపై ఎస్బీఐ సానుకూల స్పందన
  • ఈ నెల 25న గ్రూప్-2 రాసేవారికి మార్చి 4న ఎస్బీఐ మెయిన్స్ రాసేందుకు అవకాశం
  • ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటల లోపు పరీక్ష తేదీ మార్పునకు దరఖాస్తు చేయాలని సూచన
ఎస్బీఐ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే రోజు ఉంటాయని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరటనిచ్చేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ పరీక్షను మరో రోజు రాసేందుకు అనుమతించింది. మునుపటి షెడ్యూల్స్ ప్రకారం, ఏపీ గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) మెయిన్స్ పరీక్షలు ఈ నెల 25న ఉన్న విషయం తెలిసిందే. దీంతో, ఏపీపీఎస్సీ పరీక్ష తేదీ మార్చాలంటూ ఎస్బీఐకి లేఖ రాసింది. 

ఈ లేఖపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 25న గ్రూప్ - 2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. పరీక్ష తేదీ మార్పు కోరుతున్న వారు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు https://ibpsonline.ibps.in/sbijaoct23/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
APPSC
SBI
Recruitment
Andhra Pradesh

More Telugu News