Ranchi Test: రాంచీ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు

England won the toss in the Ranchi Test and choose bat first and Akash Deep Debuted For India
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్
  • అరంగేట్రం చేసిన భారత నయా పేసర్ ఆకాశ్ దీప్
  • క్యాప్ అభినందనలు తెలిపిన టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్
భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కీలకమైన నాలుగవ మ్యాచ్ షురూ అయ్యింది. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకుని, ఆతిథ్య భారత్‌కు బౌలింగ్ అప్పగించాడు. ఇక భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. పేసర్ ఆకాశ్ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా క్యాప్‌ను ఆకాశ్ దీప్‌కు అందజేశారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పిచ్‌పై కొంచెం పొడిగా ఉండడంతో పాటు పగుళ్లు కనిపిస్తున్నాయని అన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో బాగానే రాణించామని, ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన చేయాలనుకుంటున్నామని అన్నాడు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉండడం గర్వంగా ఉందని హిట్‌మ్యాన్ అన్నాడు. కుర్రాళ్లు బాధ్యతాయుతంగా, సవాలుగా తీసుకొని ఆడుతున్నారని, వారి ప్రతిభ, నైపుణ్యాలపై నమ్మకంగా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తున్నాడని, జట్టులో ఇదొక్కటే మార్పు అని టాస్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు.

తుది జట్లు.. 
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
Ranchi Test
India vs Engaland
Cricket
Team India
Akash Deep

More Telugu News