Vijayasai Reddy: ఏపీలో నోటాతో కాంగ్రెస్ పోటీ పడుతోంది: విజయసాయిరెడ్డి

Congress in AP is competing with NOTA for the 5th position says Vijayasai Reddy
  • గత ఎన్నికల్లో నోటా చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిందన్న విజయసాయి
  • కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు వేస్టేనని ఎద్దేవా
  • గెలిచే పార్టీ వైసీపీకే ఓటు వేయాలని విన్నపం
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఏపీలో నోటాతో కలిసి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అనుభవంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఈజీగా చీలిపోతారని చెప్పారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు కూడా వేస్టేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలని... వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
YSRCP
Congress
NOTA
AP Politics

More Telugu News