Samir Shah: బీబీసీ చైర్మన్ గా భారత సంతతి వ్యక్తి సమీర్ షా నియామకం

Indian origin journo Samir Shah appointed as BBC Chairman

  • భారత సంతతి వ్యక్తికి బ్రిటన్ లో ఉన్నత పదవి
  • బీబీసీ చైర్మన్ గా నాలుగేళ్ల పాటు కొనసాగనున్న సమీర్ షా
  • ఏడాదికి రూ.1.68 కోట్ల వేతనం

ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) చైర్మన్ గా డాక్టర్ సమీర్ షా నియమితులయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీబీసీకి ఓ భారత సంతతి వ్యక్తి చైర్మన్ గా ఎంపికవడం ఇదే ప్రథమం. 

బ్రిటన్ రాజు చార్లెస్-III బీబీసీ చైర్మన్ పదవి నియామకానికి కొన్ని రోజుల కిందట ఆమోద ముద్ర వేశారు. బీబీసీ చైర్మన్ గా సమీర్ షా పదవీకాలం మార్చి 4న మొదలవుతుంది. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న ఆయన ఏడాదికి రూ.1.68 కోట్ల వేతనం అందుకోనున్నారు. 

సమీర్ షా వయసు 72 సంవత్సరాలు. ఆయనకు సొంతంగా జూపిటర్ అనే టీవీ చానల్ ఉంది. టీడీ న్యూస్, జర్నలిజంలో ఆయనకు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. సమీర్ షా గతంలో బీబీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ, కరెంట్ అఫైర్స్-పొలిటికల్ అఫైర్స్ విభాగం అధిపతిగానూ వ్యవహరించారు. 

పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా 2019లో బ్రిటన్ రాణి చేతుల మీదుగా కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ పురస్కారం అందించారు. సమీర్ షా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. 1960లో బ్రిటన్ కు వలస వెళ్లారు.

  • Loading...

More Telugu News