XMail: జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకువస్తున్న ఎలాన్ మస్క్

Elon Musk set to launch XMail an alternative to Google Gmail
  • ఈమెయిల్ రంగంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న జీమెయిల్
  • త్వరలోనే ఎక్స్ మెయిల్ రంగప్రవేశం చేయనుందని మస్క్ వెల్లడి
  • కాగా, జీమెయిల్ ను మూసివేస్తున్నారంటూ ప్రచారం
  • అందులో నిజం లేదన్న గూగుల్ 
ఇంటర్నెట్ మెసేజింగ్ రంగంలో ఇప్పటివరకు జీమెయిల్ స్థానం చెక్కుచెదరకుండా ఉంది. అయితే, గూగుల్ జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ పేరిట సరికొత్త ప్రత్యామ్నాయ ఈమెయిల్ ను తీసుకువచ్చేందుకు ఎలాన్ మస్క్ సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే ఎక్స్ మెయిల్ రంగప్రవేశం చేయనుందని మస్క్ వెల్లడించారు. కాగా, జీమెయిల్ ను గూగుల్  త్వరలోనే మూసివేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2024 ఆగస్టుతో జీమెయిల్ కు తెరదించేందుకు గూగుల్ నిర్ణయించుకుందని ఎక్స్ లో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే, గూగుల్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. జీమెయిల్ ఎక్కడికీ పోదని, జీమెయిల్ ను మూసివేసే ఆలోచనేదీ తమకు లేదని స్పష్టం చేసింది.
XMail
Gmail
Elon Musk
Google

More Telugu News