TG Vehicle Registration: తెలంగాణలో వాహన నెంబర్ ప్లేట్‌లపై టీజీ.. త్వరలో కేంద్రం నోటిఫికేషన్

Centre to issue notification changing registration from TS to TG in a couple of days
  • ఈ నెల 5న రిజిస్ట్రేషన్ కోడ్ మార్పుపై కేంద్రానికి తెలంగాణ లేఖ
  • ఇటీవలే రాష్ట్ర రవాణాశాఖ సంయుక్త కార్యదర్శి ఢిల్లీ వెళ్లి అధికారులను కలిసిన వైనం
  • ఒకటి రెండు రోజుల్లో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్
  • అనంతరం, కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిజిస్ట్రేషన్ కోడ్‌లో మునుపటి టీఎస్‌కు బదులు టీజీ చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది. రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగనాయక్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కూడా కలిశారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

కేంద్ర ఉత్తర్వులు వచ్చిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ కూడా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. అయితే, ఈ మార్పును ప్రభుత్వం కొత్త వాహనాలకే పరిమితం చేసింది. పాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను యథాతథంగా కొనసాగించాలని  నిర్ణయించింది.
TG Vehicle Registration
Telangana
Central Government
Congress
Revanth Reddy

More Telugu News