Sunil Gavaskar: ‘అంపైర్స్ కాల్’.. బెన్ స్టోక్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గవాస్కర్
- అంపైర్స్ కాల్ అనవసరమనే అర్థం వచ్చేలా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కామెంట్
- భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్ కాబోయి అంపైర్స్ కాల్‌తో లైఫ్
- ఈ పరిణామంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కామెంట్
- అంపైర్స్ కాల్స్ వద్దనే వారు ఇప్పుడేమంటారని చురకలు
అంపైర్స్ కాల్ అనవసరమనే అర్థం వచ్చేలా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ చేసిన కామెంట్స్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెన్ డకౌట్ అయినా అంపైర్స్ కాల్‌తో లైఫ్ దక్కడాన్ని ఉదహరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘డకౌట్ విషయంలోనే చూడండి.. అది అంపైర్స్ కాల్. దీని వల్ల ప్రయోజనం లేదని ఇప్పటివరకూ చెబుతున్న వారు ఇప్పుడు ఏమంటారో మరి. బంతి స్టంప్స్‌ను తాకుతోంది. అలాంటప్పుడు బెన్ ‘గుడ్‌బై’ అంటూ వెళ్లిపోవాలి కదా. కానీ, ‘అంపైర్స్ కాల్’ కావడం వల్ల లైఫ్ దొరికింది. ఒకవేళ అదే వ్యతిరేకంగా నిర్ణయం ఇచ్చి ఉంటే డీఆర్ఎస్‌లోనూ ఔట్‌గా తేలేది. అప్పుడు టెస్టుల్లో ఎక్కువ శాతం రెండున్నర రోజుల్లోనే ముగిసిపోతాయి’’ అని సునీల్ గవాస్కర్ కామెంట్ చేశారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా తరపున ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. ఓపెనర్లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. అయితే, జో రూట్ శతకంతో ఇంగ్లాండ్‌ను కాపాడాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.