Sudarshan Setu: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ

PM Modi Inaugurates Sudarshan Setu Indias Longest Cable Stayed Bridge
  • గుజరాత్‌లోని ద్వారకలోగల ‘సుదర్శన్ సేతును’ ప్రారంభించిన ప్రధాని
  • బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ రూ.979 కోట్లతో వంతెన నిర్మానం
  • మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించనున్న ప్రధాని
దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరు పడ్డ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ఈ వంతెన ఉంది. 2017లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను రూ.979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు. 

కాగా, ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్‌కోట్‌లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు. కాగా, గుజరాత్‌లో నేడు సాయంత్రం జరిగే రోడ్ షోలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు.
Sudarshan Setu
Narendra Modi
Gujarat
Andhra Pradesh
AIIMS
Dwaraka

More Telugu News