Goddess Saraswati: విద్య కోసం సరస్వతీదేవి ఏం చేశారు?.. టీచర్ నోటి దురుసు

Teacher suspended for disrespect goddess Saraswati Devi

  • రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఘటన
  • రిపబ్లిక్ డే వేడుకల్లో సరస్వతీదేవి ఫొటో పెట్టకుండా అడ్డుకున్న టీచర్
  • క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో టీచర్‌పై సస్పెన్షన్ వేటు

చదువుల తల్లి సరస్వతిపై స్వయంగా ఓ ఉపాధ్యాయురాలే నోరు పారేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిందీ ఘటన. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం కమిటీ వేశారు. తాజాగా ఆమెను విధుల నుంచి తొలగించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లకాడియాలోని కిషన్‌గంజ్ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే కోసం స్టేజీ ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు పెట్టారు. వారి ఫొటోల సరసన సరస్వతీదేవి ఫొటో పెడుతుండగా హేమలతా భైర్వ అనే ఉపాధ్యాయురాలు అడ్డుకున్నారు. విద్య కోసం సరస్వతీదేవి ఏం చేసిందని ఆ ఫొటో పెడుతున్నారని ప్రశ్నిస్తూ ఫొటో పెట్టకుండా అడ్డుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. వెంటనే దర్యాప్తు కోసం క్రమశిక్షణ కమిటీ వేశారు. దర్యాప్తు జరిపిన కమిటీ హేమలత వ్యాఖ్యలు నిజమేనని తేల్చి చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రతిపాదించింది. దీంతో ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ మాట్లాడుతూ.. సరస్వతీదేవిని టీచర్ హేమలత అవమానించి హిందూ దేవత పట్ల చులకన భావంతో మాట్లాడారని, అందుకే చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News