Theegala Krishna Reddy: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తీగల కృష్ణారెడ్డి
- బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న తీగల
- తీగలతో పాటు రాజీనామా చేసిన ఆయన కోడలు అనిత
- రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ చైర్మన్ గా ఉన్న అనిత
- త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం
మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. బీఆర్ఎస్ నాయకత్వం తమను పట్టించుకోవడంలేదని, అలాంటి పార్టీలో ఉండలేమని తీగల కృష్ణారెడ్డి, అనిత పేర్కొన్నారు.
కాగా, వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ సభకు ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పలు దఫాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి ప్రారంభమైంది. మేయర్ గానూ, హుడా చైర్మన్ గానూ పనిచేశారు. 2014లో ఆయన మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఏడాది బీఆర్ఎస్ లో చేరారు.