Ashok Veeraraghavan: అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
- రైస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్‌కు ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు
- అవార్డును ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు
ఇమేజింగ్ సాంకేతికతలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన భారత సంతతి శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్‌కు ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు దక్కింది. టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అవార్డుల్లో ఒకటిగా పేరపడ్డ ఈ అవార్డును ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్ , సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించింది. చెన్నైలో పుట్టి పెరిగిన వీరరాఘవన్ ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలోని జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలోని పలు సవాళ్లను అధిగమించారు. ఈ అంశాలన్నిటిపైనా సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నామని ప్రొ. వీరరాఘవన్ తెలిపారు. ప్రస్తుత సాంకేతికతతో చూడటం సాధ్యం కాని వాటిని కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని వీరరాఘవన్ తెలిపారు.