Kapu Ramachandra Reddy: వైసీపీకి దూరంగానే ఉన్నా... ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతా: కాపు రామచంద్రారెడ్డి

Kapu Ramachandra Reddy said he will inform in which party he join
  • కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం
  • నేడు విజయవాడలో రాజ్ నాథ్ సింగ్, పురందేశ్వరిలను కలిసిన కాపు
  • రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టీకరణ
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన ఇవాళ విజయవాడలో బీజేపీ సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. అక్కడ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిలను కుటుంబ సమేతంగా కలిశారు. 

అనంతరం కాపు రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు. తాను ప్రజాజీవితంలో ఉన్నానని, అందుకే రాజకీయాల్లో కొనసాగాలని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయ భవిష్యత్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని, ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతానని అన్నారు. 

ప్రస్తుతానికి వైసీపీ నుంచి దూరంగానే ఉన్నానని కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీతో తనకు సంబంధంలేదని తెలిపారు.
Kapu Ramachandra Reddy
Rayadurgam
MLA
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News