Tollywood: రాడిసన్ హోటల్ పార్టీలో దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదు: మాదాపూర్ డీసీపీ

Madhapur DCP talks about radisson hotel drug case issue
  • కేసులో విచారణకు హాజరవుతానని క్రిష్ చెప్పారని వెల్లడించిన డీసీపీ
  • రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని వెల్లడి
  • ముగ్గురు కొకైన్ తీసుకున్నట్టుగా పరీక్షల్లో తేలిందని వెల్లడి
రాడిసన్ హోటల్‌లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పినట్లు తెలిపారు. వివేకానంద, కేదార్, నిర్భయ్‌లు నిన్న కొకైన్ తీసుకున్నట్టుగా పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

వివేకానందకు అబ్బాస్ పదిసార్లు కొకైన్ సరఫరా చేసినట్లు దర్యాఫ్తులో తేలిందన్నారు. కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తేలిందన్నారు. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు వెల్లడించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tollywood
drugs case
director krish
Hyderabad

More Telugu News