Singer Chinmay: సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు

Gachibowli Police Filed A Case Aganist Singer Chinmay Sripada
  • సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ ఇన్ స్టాలో వీడియో పెట్టిన సింగర్
  • అందులో దేశాన్ని అవమానించిందంటూ హెచ్ సీయూ విద్యార్థి ఫిర్యాదు
  • కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు
సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టిన సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో అన్నపూర్ణను విమర్శించే క్రమంలో చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్రం దేనికి.. రాత్రి 12 గంటల తర్వాత మహిళలకు బయట ఏంపని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువైపోయింది. మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా సరే.. వాళ్లు (పురుషులు) ఏదో ఒకటి అనేటట్లుగా రెడీ అవుతున్నాం. ఎదుటివాళ్లదే తప్పనడం కాదు మనవైపు కూడా చూసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. అన్నపూర్ణ వీడియోను షేర్ చేస్తూ.. ఆమె నటనకు అభిమానినని చెబుతూ, మనం అభిమానించే వాళ్లు ఇలా మాట్లాడితే తీవ్రమైన వేదన కలుగుతుందని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. ‘ఇదొక .... కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Singer Chinmay
Chinmay Case
Annapurnamma
Women Rights
Insta vedio

More Telugu News