BRS: పార్టీ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్... మెసేజ్ పంపించాలని సూచన!
- అధికార పార్టీ నుంచి వేధింపులు ఉంటే లీగల్ సెల్ అండగా ఉంటుందని వెల్లడి
- సోషల్ మీడియాలో లేదా ప్రజాక్షేత్రంలో బెదిరిస్తే లేదా అక్రమకేసుల పేరుతో వేధిస్తే లీగల్ సెల్ అండగా ఉంటుందన్న పార్టీ
- ఇబ్బందులు ఉంటే 8143726666 నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని సూచన
- మెసేజ్ మాత్రమే చేయాలి... ఫోన్ కాల్ చేయవద్దని విజ్ఞప్తి
పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి వేధింపులు ఉంటే లీగల్ సెల్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ కార్యకర్తలను సోషల్ మీడియాలో లేదా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ నాయకులు కానీ, వేరే ఎవరైనా కానీ బెదిరిస్తే లేదా అక్రమకేసుల పేరుతో వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపింది. మీకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే 8143726666 నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని సూచించింది.
ఫోన్ కాల్ చేయవద్దు... మెసేజ్ మాత్రమే
కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురైతే పై నెంబర్‌కు కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలని తెలిపింది. దయచేసి ఫోన్ కాల్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. లీగల్ అంశాలకు సంబంధించిన అంశాలు మాత్రమే పంపించాలని కోరింది. బీఆర్ఎస్ నిర్ణయం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.