Obesity: ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయులు.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

Over 1 Billion People Around The World Are Obese says Study

  • 1990 నుంచి 2022 మధ్య నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయులు
  • క్రమంగా తగ్గుతున్న తక్కువ బరువున్న వ్యక్తుల సంఖ్య
  • ‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 1990 నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఫలితంగా చాలా దేశాలలో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని ‘ది లాన్సెట్ జర్నల్’ ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది. ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (NCD-RisC), ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలన చేశామని వివరించింది. 1990తో పోల్చితే ప్రస్తుతం పిల్లలు, యుక్తవయసువారిలో ఊబకాయం నాలుగు రెట్లు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.

పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని అధ్యయనం పేర్కొంది. 2022లో మొత్తం 159 మిలియన్ల మంది పిల్లలు, యుక్తవయస్కులు,  879 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారని వివరించింది. కాగా ఊబకాయం, తక్కువ బరువు పోషకాహార లోపానికి రెండు రూపాలని అధ్యయనం పేర్కొంది. అనేక విధాలుగా ప్రజల ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించింది. 1990లో పెద్దవారిలో మాత్రమే ఊబకాయం కనిపించేదని, ఇప్పుడు బడికి వెళ్లే పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలోనూ కనిపిస్తోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ మజిద్ ఎజాటి ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News